దమ్ముంటే అందరూ రాజీనామా చేయండి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-10-11T09:34:10+05:30 IST

‘‘రాజీనామాలు అంటూ విశాఖలో ఒకరిద్దరు హడావిడి చేయడం కాదు. వైసీపీకి దమ్ముంటే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి 3రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు ప్రజలు ఎవరి నిర్ణయానికి

దమ్ముంటే అందరూ రాజీనామా చేయండి: సోమిరెడ్డి

నెల్లూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘రాజీనామాలు అంటూ విశాఖలో ఒకరిద్దరు హడావిడి చేయడం కాదు. వైసీపీకి దమ్ముంటే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి 3రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు ప్రజలు ఎవరి నిర్ణయానికి మద్దతిస్తారో తేలిపోతుంది’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి కి నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపారు. ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మనిషన్నాక కొద్దిగైనా మనస్సాక్షి ఉండాలి. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు చేతనైతే ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలి. రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చాలని చూస్తున్నారా!? విశాఖలో భూములు దోచుకునేందుకే అక్కడ రాజధాని డ్రామాలు ఆడుతున్న్డారు. ఇప్పటికే రూ.40 వేల కోట్ల అవినీతి విశాఖలో జరిగింది’’ అని ఆరోపించారు.

Read more