జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లపై మాజీ మంత్రి సెటైర్లు

ABN , First Publish Date - 2022-06-29T21:59:23+05:30 IST

జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు వేశారు. మన ఏపీ సీఎం జగన్ రెడ్డికి నొక్కడం బాగా అలవాటైపోయిందని, ...

జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లపై మాజీ మంత్రి సెటైర్లు

విజయవాడం: జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి సోమిరెడ్డి సెటైర్లు వేశారు. మన ఏపీ సీఎం జగన్ రెడ్డికి నొక్కడం బాగా అలవాటైపోయిందని, ఇప్పటివరకు ఓటు రాజకీయం కోసం సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కుతూ వచ్చారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని దివాళ స్థితికి తెచ్చి దిక్కుతోచక రివర్స్ నొక్కుళ్లకు దిగారని సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు రూ.800 కోట్లు గుట్టుచప్పుడు కాకుండా లాగేశారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. మొన్నేమో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ రివర్స్ బటన్‌తో ఊడ్చేశారని, ఈ రివర్స్ రెడ్డి రివర్స్ పాలనలో ఇలాంటి సిత్రాలు ఇంకా ఎన్ని చూడాలో అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-29T21:59:23+05:30 IST