Gorantla Madhav video: ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలి?: లోకేష్

ABN , First Publish Date - 2022-08-10T22:46:08+05:30 IST

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా (Social media) లో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియోను ఒరిజనల్

Gorantla Madhav video: ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలి?: లోకేష్

అమరావతి: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా (Social media) లో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) తప్పుబట్టారు. ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఫోరెన్సిన్ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.


ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చూపించాలని నిలదీశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు గోడల మధ్య జరిగిందన్నారని, ఎస్పీ అసలు వీడియో గోరంట్లదే కాదని చెబుతున్నారని లోకేష్ గుర్తుచేశారు. అయినా వీడియోపై ఎస్పీ ఎలా ప్రకటిస్తారని, ఆయన ఫోరెన్సిక్ నిపుణుడా అని ప్రశ్నించారు. ఐదు రోజుల తర్వాత ఫేక్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అంబటి రాంబాబు రాసలీలలు కూడా ఫేక్ అంటారా అని లోకేష్ సందేహం వ్యక్తం చేశారు. 


మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోయినట్లు అనంతపురం ఎస్పీ తెలిపారు. వీడియోను మార్ఫింగ్‌ (Morphing) లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. మాధవ్ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోని మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. వీడియోను మొదట iTDP official అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ నెల 4 అర్ధరాత్రి 2.07 గంటలకు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేసినట్లు చెప్పారు. సదరు నెంబరు యూకే వొడాఫోన్‌కు సంబంధించినదిగా గుర్తించామని ప్రకటించారు.






Updated Date - 2022-08-10T22:46:08+05:30 IST