గురుకుల పాఠశాలలో విద్యార్థినిని కాటేసిన పాము
ABN , First Publish Date - 2022-12-16T08:23:06+05:30 IST
సూళ్లూరుపేట బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది. అయిదవ తరగతి చదువుతున్న హేమ అనే విద్యార్థినిని పాము కాటేసింది.
Nellore : సూళ్లూరుపేట బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది. అయిదవ తరగతి చదువుతున్న హేమ అనే విద్యార్థినిని పాము కాటేసింది. విద్యార్థిని ఆరుబయట దుస్తులు ఆరేస్తుండగా.. పాము కాటు వేసింది. గురుకుల పాఠశాల సిబ్బంది హేమను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. హేమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.