SLBC meeting: మంత్రి బుగ్గన అధ్యక్షతన ఎస్‌ఎల్బీసీ సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2022-10-11T17:59:15+05:30 IST
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది.
అమరావతి: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana rajendranath) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో బ్యాంకుల పెర్ఫార్మెన్స్, లక్ష్యాలు, వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వల్లవన్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ తోపాటు వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు, ఎల్డీఎంలు, వివిధ బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు హజరయ్యారు.