‘ఆరునెలలు శ్రీవారి దర్శనం నిలుపుదల’ అవాస్తవం: వేణుగోపాల దీక్షితులు

ABN , First Publish Date - 2022-12-31T03:51:01+05:30 IST

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామి దర్శనాన్ని ఆరునెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రధాన అర్చకులు

‘ఆరునెలలు శ్రీవారి దర్శనం నిలుపుదల’ అవాస్తవం: వేణుగోపాల దీక్షితులు

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామి దర్శనాన్ని ఆరునెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమయంలోనూ యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుందని తెలిపారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయ ఏర్పాటుకు అర్చకులు 2023 మార్చి1న ముహూర్తంగా నిర్ణయించారు.

Updated Date - 2022-12-31T03:51:02+05:30 IST