సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు: శిల్పా చక్రపాణిరెడ్డి

ABN , First Publish Date - 2022-02-17T23:40:48+05:30 IST

బీజేపీ నేత సోము వీర్రాజుపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కాదు..

సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు: శిల్పా చక్రపాణిరెడ్డి

అమరావతి: బీజేపీ నేత సోము వీర్రాజుపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు అని ధ్వజమెత్తారు. మతిభ్రమించి సోము వీర్రాజు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఓ రౌడీ అని, పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో అర్చకులపై బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి దుర్భాషలాడాడని, ఇదేనా బీజేపీ సంస్కృతి అని ప్రశ్నించారు. శ్రీశైలంలో జరిగిన అన్ని అవకతవకలపై చేతనైతే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నసమయంలో ముస్లింలు దుకాణాలు నిర్వహించుకున్నారని గుర్తుచేశారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.

Updated Date - 2022-02-17T23:40:48+05:30 IST