APలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారు?: Shailajanath
ABN , First Publish Date - 2022-06-09T19:21:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారని శైలజానాథ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Amaravathi: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రజలకు చెబుతారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath) వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గడప దాటని జగన్ రెడ్డి (Jagan Reddy) హిత బోధ చేయడమా?.. ఎన్నికలకు రెండేళ్ల ముందే హడావుడి ఎందుకని నిలదీశారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. మూడేళ్ళయినా ఒక్క డీఎస్సీ ప్రకటించారా? అని ప్రశ్నించారు. పది పాపం జగన్ రెడ్డి సర్కారుదేనన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన సరే... ఉద్యోగాలు ఏవన్నారు. జగన్ను ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.