దేశాన్ని సంస్కార హీనులు పాలిస్తున్నారు: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2022-02-14T01:37:08+05:30 IST

దేశాన్ని సంస్కార హీనులు పాలిస్తున్నారని, వారి పాలన ఎక్కువ కాలం కొనసాగదని ఏపీసీసీ అధ్యక్షడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు.

దేశాన్ని సంస్కార హీనులు పాలిస్తున్నారు: శైలజానాథ్‌

అనంతపురం: దేశాన్ని సంస్కార హీనులు పాలిస్తున్నారని, వారి పాలన ఎక్కువ కాలం కొనసాగదని ఏపీసీసీ అధ్యక్షడు సాకే శైలజానాథ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు శనిలా దాపురించిందని దుయ్యబట్టారు.  దేశాన్ని నిట్టనిలువునా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల అవివేక, అనాలోచిత నిర్ణయాలతో అనేక వర్గాల ప్రజలు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు గాడ్సేకు పూజలు చేశారని,  ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పదవులు అనుభవించారని,  ప్రస్తుతం రాహుల్‌ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని శైలజానాథ్ సూచించారు.

Updated Date - 2022-02-14T01:37:08+05:30 IST