సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తా: మంత్రి కాకాణి

ABN , First Publish Date - 2022-04-17T23:15:23+05:30 IST

సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తానని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కాకాణి మంత్రిగా

సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తా: మంత్రి కాకాణి

నెల్లూరు: సీనియర్లు, జూనియర్లందర్నీ కలుపుకొని వెళ్తానని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కాకాణి మంత్రిగా ఎన్నుకున్నారు. మంత్రి అయిన తర్వాత ఆయన మొదటి సారి నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాజీమంత్రి అనిల్‌కుమార్‌ సభను పోటీ కార్యక్రమంగా అనుకోవడం లేదన్నారు. అనిల్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటున్నారని కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు.

 

Updated Date - 2022-04-17T23:15:23+05:30 IST