‘విజ్ఞాన్‌’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-06-07T09:50:04+05:30 IST

టెక్‌, బీ ఫార్మసీ, అగ్రికల్చరల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన విశాట్‌ 2022 ఫేజ్‌ 1

‘విజ్ఞాన్‌’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

9 నుంచి కౌన్సెలింగ్‌

గుంటూరు(విద్య), జూన్‌ 6: విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌, బీ ఫార్మసీ, అగ్రికల్చరల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా  నిర్వహించిన విశాట్‌ 2022 ఫేజ్‌ 1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) ఫలితాలను  వీసీ పీ.నాగభూషణ్‌ సోమవారం విడుదల చేశారు. వడ్లమూడిలోని విజ్ఞాన్‌ వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ...విశాట్‌ ఫలితాలను ఠీఠీఠీ.ఠిజీజుఽ్చుఽ.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు. ఫలితాల్లో ర్యాంకులు సాధించిన వారికి జూన్‌ 9వ తేదీ నుంచి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని తెలిపారు. విశాట్‌లో 1 నుంచి 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 75 శాతం స్కాలర్‌షిప్‌, 100 నుంచి 200లోపు వారికి 50 శాతం, 201 నుంచి 400లోపు వారికి 25 శాతం, 401 నుంచి 2 వేలలోపు వారికి 10 శాతం స్కాలర్‌షిప్‌ అందజేస్తామని తెలిపారు.


విశాట్‌ మొదటి పది ర్యాంకర్లు వీరే

విశాట్‌లో మొదటి ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోడూరి అన్విత కైవసం చేసుకోగా, ద్వితీయ ర్యాంకును ఇదే జిల్లాకు చెందిన కొప్పిశెట్టి సురాక్షయ్‌ సాధించారు. తృతీయర్యాంకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన చిలక పర్దేందర్‌ సాధించారు. 4వ ర్యాంకు గుత్స వర్షిణి (వడ్డికాడ శ్రీకాకుళం), 5వ ర్యాంకు మారీడు భారతి వర్ష (కృష్ణాజిల్లా), 6వ ర్యాంకు సౌరవ్‌ ఠాకూర్‌ (నార్త్‌ బెంగాల్‌), 7వ ర్యాంకు అడప సూర్యలక్ష్మీదేవి సంతోషి (కోరుకొండ, తూర్పుగోదావరి జిల్లా), 8వ ర్యాంకు బండి సూర్యశ్రీజ (రాజమహేంద్రవరం), 9వ ర్యాంకు సైదా ఫాతిమా (షేక్‌పేట్‌, హైదరాబాదు), 10వ ర్యాంకు వస్కూరి అనూహ్య లక్ష్మీ(పాలకొల్లు,పశ్చిమ గోదావరి)  సాధించారని వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more