రేపు పాఠశాలల బంద్: ఏబీవీపీ
ABN , First Publish Date - 2022-07-18T08:56:45+05:30 IST
రేపు పాఠశాలల బంద్: ఏబీవీపీ
అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడారు. డీఎస్సీ నిర్వహించి 24వేల టీచర్ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేశారు.