తాగుబోతులిద్దరు చనిపోతే దాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారు: సామినేని ఉదయభాను

ABN , First Publish Date - 2022-03-14T18:19:12+05:30 IST

మద్యాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా ప్రోత్సహించారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరోపించారు.

తాగుబోతులిద్దరు చనిపోతే దాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారు: సామినేని ఉదయభాను

అమరావతి : మద్యాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా ప్రోత్సహించారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆరోపించారు. బాగా అమ్మించిన అధికారులకు ప్రమోషన్‌లు ఇచ్చారన్నారు. ఇద్దరు పచ్చి తాగుబోతులు చనిపోతే దాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్నారని ఉదయభాను విమర్శించారు. గుడి దగ్గర, బడిదగ్గర, మెయిన్ రోడ్ పైన మద్యం షాప్‌లను ప్రోత్సహించారన్నారు. జంగారెడ్డి గూడెం వెళ్లాలని ఇక్కడ సభలో గొడవ చేశారన్నారు. బీసీ స్పీకర్‌పై పేపర్‌లు చింపి విసిరేయడం ఆయన్ను అవమానించడమేనని సామినేని ఉదయభాను పేర్కొన్నారు.

Read more