ముందస్తు అవసరం మాకు లేదు: సజ్జల

ABN , First Publish Date - 2022-12-16T01:54:57+05:30 IST

‘‘ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి, ఐదేళ్లు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తాం. పార్టీలో ఊపు లేకపోవడం వల్లే చంద్రబాబు ఇలా ముందస్తు ఎన్నికలని అంటున్నారు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ముందస్తు అవసరం మాకు లేదు: సజ్జల

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి, ఐదేళ్లు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్తాం. పార్టీలో ఊపు లేకపోవడం వల్లే చంద్రబాబు ఇలా ముందస్తు ఎన్నికలని అంటున్నారు’’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం వైసీపీ సర్కారుకు లేదు. పొత్తులు, ఎత్తులు లాంటి చచ్చు ఆలోచనలు మాకు లేవు. కౌలు రైతులకు సంబంధించి మెరుగైన విధానం ఏమైనా ఉంటే పవన్‌ కల్యాణ్‌ చెప్పొచ్చు. ఇప్పటికే వారికి ప్రభుత్వం సాయం చేస్తోంది’’ అని సజ్జల తెలిపారు.

Updated Date - 2022-12-16T01:54:58+05:30 IST