క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తాచాటిన ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులు
ABN , First Publish Date - 2022-07-28T08:58:07+05:30 IST
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సత్తాచాటిన ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులు
గుంటూరు(విద్య), జూలై 27: ప్రముఖ కార్పొరేట్ సంస్థ టీసీఎస్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీ విద్యార్థులు సత్తాచాటారని కళాశాల కార్యదర్శి రాయపాటి గోపాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. చివర సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 220 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. డిజిటల్ ప్రొఫైల్‌లో రూ.7 లక్షల ప్యాకేజీతో 19మంది, నింజాప్రొఫైల్‌లో రూ.3.36 లక్షల ప్యాకేజితో 201 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు 1,504 మంది ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మినేని శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.