AP News: శవంతో రోడ్డుపై బైఠాయింపు .. ఎందుకంటే..
ABN , First Publish Date - 2022-12-16T21:15:22+05:30 IST
Chittor: తవణంపల్లి మండలం సిద్దంపల్లె గ్రామస్థులు శవంతో రోడ్డుపై బైఠాయింపు నిరసన తెలిపారు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తుండగా పుణ్య సముద్రం గ్రామస్థులు
Chittor: తవణంపల్లి మండలం సిద్దంపల్లె గ్రామస్థులు శవంతో రోడ్డుపై బైఠాయింపు నిరసన తెలిపారు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తుండగా పుణ్య సముద్రం గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన కొందరికి శ్మశానానికి వెళ్లే దారిలో ఇంటి స్థలాలు మంజూరు చేశారని, ఆ స్థలాల్లో మృతదేహాలకు అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని పుణ్యసముద్రం గ్రామస్థులు వాదనకు దిగారు. అయితే తాము చాలా ఏళ్లుగా అంత్యక్రియలను అక్కడే నిర్వహిస్తున్నామని సిద్దంపల్లి గ్రామస్థులు సమాధానమిచ్చారు. ఎవరికి వారు తగ్గకపోవడంతో చిత్తూరు ఆర్డీవో,డీఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.