6 నుంచి ఆర్జేయూకేటీ క్యాంప్సలు
ABN , First Publish Date - 2022-06-04T09:34:57+05:30 IST
రాష్ట్రంలోని ఆర్జేయూకేటీ కళాశాలలు ఈ నెల 6వ తేదీనుంచే ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని ఆర్జేయూకేటీ కళాశాలలు ఈ నెల 6వ తేదీనుంచే ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వేసవి తీవ్రత ఎక్కువగా ఉందన్న విజ్ఞప్తులను పరిశీలించి ఈ నెల 10వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. దీనికోసం సంబంధిత కళాశాలల డీన్ల వద్ద ఐదో తేదీ లోపు రిజిస్టరు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.