తెలంగాణలో పెరుగుతున్న ఆత్మహత్యలు

ABN , First Publish Date - 2022-12-10T03:08:53+05:30 IST

తెలంగాణలో ఏటేటా ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది....

తెలంగాణలో పెరుగుతున్న ఆత్మహత్యలు

ఐదేళ్లలో 41,369 మంది ఆత్మహత్య

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏటేటా ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2017 నుంచి 2021 మధ్యకాలంలో రాష్ట్రంలో 41,369 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. 2019లో రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2020నాటికి ఆ సంఖ్య 8058కి, 2021లో 10,171కి పెరిగినట్టు తెలిపారు. లోక్‌సభలో సీపీఎం ఎంపీ ఎస్‌ వెంకటేశన్‌ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Updated Date - 2022-12-10T03:08:54+05:30 IST