సురేష్‌కుమార్‌కు సమగ్రశిక్ష ఎస్పీడీ బాధ్యతలు

ABN , First Publish Date - 2022-10-04T07:47:49+05:30 IST

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌కు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఎస్పీడీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

సురేష్‌కుమార్‌కు  సమగ్రశిక్ష ఎస్పీడీ బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురే్‌షకుమార్‌కు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఎస్పీడీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర శిక్ష ఎస్పీడీగా ఉన్న వెట్రిసెల్విని పాఠశాల విద్యాశాఖలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుకు ప్రత్యేకాధికారిగా నియమించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతుల్లో అమల్లోకి తెచ్చిన ఇంగ్లిష్‌ మీడియం అమలు బాధ్యతను ఆమె పర్యవేక్షిస్తారు. అలాగే పాఠశాల విద్యాశాఖకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఆమె వ్యవహరిస్తారు.

====

Read more