రేపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాక
ABN , First Publish Date - 2022-11-06T00:26:07+05:30 IST
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు
నెల్లూరు,(స్టోన్‌హౌస్‌పేట), నవంబరు 5 : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్ యాదవ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు రమారాయల్ ఫంక్షన్ హాలులో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత 10.45 గంటలకు జయభారత్ హాస్పిటల్‌లో జరిగే కార్యక్రమంలో, 11.45 గంటలకు టౌన్‌హాలులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు పల్లెపాడులోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శిస్తారని, సాయంత్రం 6.15 గంటలకు మూలాపేట గణేష్ ఘాట్‌లో జరిగే కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి, నేతలు బి శ్రీనివాసులు, ఎర్రబోలు రాజేష్, కొత్తపేట వెంకటేశ్వర్లు, మొగరాల సురేష్, కందికట్ల రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.