దుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో మళ్లీ సస్పెండైన రికార్డ్ అసిస్టెంట్

ABN , First Publish Date - 2022-06-25T15:46:19+05:30 IST

దుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్(Record Assistant) తిరుమల సుబ్రమణ్యం మరోసారి సస్పెండ్ అయ్యాడు.

దుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో మళ్లీ సస్పెండైన రికార్డ్ అసిస్టెంట్

విజయవాడ : దుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో రికార్డ్ అసిస్టెంట్(Record Assistant) తిరుమల సుబ్రమణ్యం మరోసారి  సస్పెండ్ అయ్యాడు. 2019-20 సంవత్సరాల్లో అమ్మవారికి భక్తులు(Devottees) సమర్పించిన 77 చీరల(Sarees) మాయమైనట్లు ఆడిట్ విభాగం గుర్తించింది. చీరల విలువ రూ.7లక్షలుగా అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఇదే చీరల మిస్ మ్యాచ్ విషయంలో 6నెలల పాటు సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు. చీరల ఇండెట్లు సమర్పించని కారణంగా సుబ్రహ్మణ్యాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ మరోసారి సస్పెండ్ చేశారు. 

Updated Date - 2022-06-25T15:46:19+05:30 IST