అమరావతి రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీదారులు

ABN , First Publish Date - 2022-10-07T08:17:12+05:30 IST

అమరావతి రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీదారులు

అమరావతి రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దోపిడీదారులు

వైసీపీపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండదు: బొత్స

విజయనగరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పాదయాత్రలో అమరావతి రైతుల ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ దోపీడీదారులు ఉన్నారని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభావం వైసీపీపై ఏమాత్రం ఉండదని అన్నారు. గురువారం విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని, ఇందులో బీఆర్‌ఎస్‌ కూడా ఒకటని.. అంతకుమించి ఈ పార్టీ ప్రభావం రాష్ట్రంలో ఉండదని చెప్పారు. అమరావతి పేరు చెప్పి టీడీపీ నేతలు దోచుకున్నారని.. ఎవరెంత దోచుకున్నారన్నది అసెంబ్లీ సాక్షిగా గతంలో వెల్లడించామని తెలిపారు. అమరావతి రైతులకు తామెందుకు సహకరించాలని ప్రశ్నించారు. అక్కడ ఎక్కువ భూములు టీడీపీవారివేనని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని.. దీనిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

Updated Date - 2022-10-07T08:17:12+05:30 IST