బీజేపీ వ్యతిరేక కూటమికి రెడీ!

ABN , First Publish Date - 2022-08-17T10:01:44+05:30 IST

దేశంలో ప్రజా వ్యతిరేక, మతతత్వ అరాచక పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీని ఇంటికి సాగనంపడానికి దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి పురుడు పోసుకుంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.

బీజేపీ వ్యతిరేక కూటమికి రెడీ!

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

రాయచోటి టౌన్‌, ఆగస్టు 16: దేశంలో ప్రజా వ్యతిరేక, మతతత్వ అరాచక పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీని ఇంటికి సాగనంపడానికి దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి పురుడు పోసుకుంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.  దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ ఒకతాటిపైకి వస్తున్నాయన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన సీపీఐ జిల్లా మహాసభల్లో ఆయన ప్రసంగించారు. గుజరాత్‌లో హత్యలు చేసిన మోదీ ప్రధాని కావడం, మహారాష్ట్రలో హత్యలు చేసి రాష్ట్ర బహిష్కరణకు గురైన అమిత్‌షా హోంమంత్రి కావడం ఈ దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు, అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. హత్యలు చేసిన ఎమ్మెల్సీకి సన్మానాలు, వ్యభిచారానికి పాల్పడిన ఎంపీకి ఊరేగింపులు ఇదేనా ప్రజాస్వామ్యంటే అని ఆయన ప్రశ్నించారు. 

Read more