Vijayawada : రాపిడో బైకర్స్ వర్సెస్ ఆటో డ్రైవర్లు

ABN , First Publish Date - 2022-12-31T08:40:17+05:30 IST

రాపిడో బైకర్స్, ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్‌ని ఎక్కించుకునే విషయంపై వివాదం తలెత్తింది.

Vijayawada : రాపిడో బైకర్స్ వర్సెస్ ఆటో డ్రైవర్లు

విజయవాడ : రాపిడో బైకర్స్, ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్‌ని ఎక్కించుకునే విషయంపై వివాదం తలెత్తింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకుండా రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్స్‌ని రాపిడో బైకర్స్ ఎక్కించుకుంటున్నారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదంటూ ఆటో డ్రైవర్లు ప్రశ్నించారు. మీకేం సంబంధం అంటూ వాగ్వాదానికి రాపిడో బైక్ రైడర్స్ దిగారు. ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

Updated Date - 2022-12-31T08:40:18+05:30 IST