-
-
Home » Andhra Pradesh » Rajendranath Reddy takes charge-MRGS-AndhraPradesh
-
ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-02-19T15:21:36+05:30 IST
ఏపీ నూతన డీజీపీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను తీసుకున్నారు

అమరావతి : ఏపీ నూతన డీజీపీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను తీసుకున్నారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు సంవత్సరాలకు పైగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ విధులు నిర్వహించారు.
1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.