ఏపీ, తెలంగాణల్లో చెదురుమొదురు వర్షాలు పడే అవకాశం..
ABN , First Publish Date - 2022-08-08T18:33:26+05:30 IST
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడి..

విశాఖపట్నం : బంగాళాఖాతం(Bay of Bengal)లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా(Soutch Odisha) ఉత్తర కోస్తా(North Kosta) జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి(East and west Godavari)లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ(Telangana), మిగతా ఆంధ్ర ప్రదేశ్(Andhrapradesh) ప్రాంతాల్లో కూడా చెదురుమొదురు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు(Fishemen) అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.