నాణ్యమైన భోజనం అందించకపోతే ఫిర్యాదు చేయండి

ABN , First Publish Date - 2022-12-07T01:51:18+05:30 IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని, ఎక్కడైనా నాణ్యమైన ఆహారం అందకపోతే తమకు ఫిర్యాదుచేయాలని ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.

నాణ్యమైన భోజనం అందించకపోతే ఫిర్యాదు చేయండి

ముమ్మిడివరం, డిసెంబరు 6: ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని, ఎక్కడైనా నాణ్యమైన ఆహారం అందకపోతే తమకు ఫిర్యాదుచేయాలని ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లా ముమ్మిడివరం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. తొలుత మార్కెట్‌ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడున్న గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ద్వారా రూ.5వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముమ్మిడివరం జడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి మొత్తం విద్యార్థినుల సంఖ్య ఎంత, ఈరోజు ఎంతమంది భోజనాలు చేశారని హెచ్‌ఎం వి.శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. పాఠశాల నుంచి కోడిగుడ్లు బయటికి వెళ్తున్నా యని తమకు ఫిర్యాదు అందిందని, అటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థినులతో మమేకమై మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, ఎంతమంది భోజనాలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 65 శాతంమంది ఇంటి నుంచే భోజ నం తెచ్చుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించారు. మధ్యాహ్న భోజన పథకంలో పోర్టిఫైడ్‌ బియ్యం వినియోగించడంవల్ల బలవర్థకమైన ఆహారం లభిస్తుందన్నారు. ఉపాధ్యా యులు కూడా పిల్లలతో కలిసి భోజనం చేస్తే వారికి స్ఫూర్తిగా ఉంటుందన్నారు. వాట్సాప్‌ నెంబరు 9490551117 ఉన్న విజి టింగ్‌ కార్డులను విద్యార్థులకు అందించారు. పదో తరగతిలో 580 మార్కులు దాటితే రూ.5వేలు ప్రోత్సాహాన్ని తాను వ్యక్తిగతంగా అందిస్తానని చెప్పారు. అనంతరం అన్నంపల్లి లోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌లో ఉన్న ఆయిల్‌, కందిపప్పులను పరిశీలించారు. పర్యటనలో ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కిరణ్‌, డిప్యూటీ డైరెక్టర్‌ పి.సురేష్‌, ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి, తహశీల్దార్‌ యడ్ల రాంబాబు, ఎంఈవో బొజ్జా రమణశ్రీ, సీడీపీవో వై.విజయశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:51:23+05:30 IST