Uyyuru జెడ్పీటీసీ పదవికి పూర్ణిమ రాజీనామా
ABN , First Publish Date - 2022-08-16T19:43:53+05:30 IST
కృష్ణా జిల్లా ఉయ్యూరు జెడ్పీటీసీ (ZPTC) యలమంచిలి పూర్ణిమ (Purnima) తన పదవికి రాజీనామా చేశారు.

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు జెడ్పీటీసీ (ZPTC) యలమంచిలి పూర్ణిమ (Purnima) తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన పూర్ణిమ రాజీనామాతో వైసీపీ (YCP)లో కలకలం రేగింది. అధికార పార్టీ నేతల సహాయ నిరాకరణ, ఎవ్వరూ సహకరించకపొవడంపై పూర్ణిమ అసంతృప్తితో ఉన్నారు. గతంలో అనేకసార్లు చెప్పినప్పటికీ ఎవ్వరు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన పూర్ణిమ... మచిలీపట్నంలో కలెక్టర్కు రాజీనామా పత్రం సమర్పించారు.