Purandeswari : ఆ పేరుతో కులాలు మధ్యన చిచ్చుపెట్టారు

ABN , First Publish Date - 2022-12-07T11:38:55+05:30 IST

బీసీ కార్పొరేషన్ పేరుతో కులాలు మధ్యన చిచ్చుపెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి విమర్శించారు.

Purandeswari : ఆ పేరుతో కులాలు మధ్యన చిచ్చుపెట్టారు

Purandeswari : బీసీ కార్పొరేషన్ పేరుతో కులాలు మధ్యన చిచ్చుపెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి విమర్శించారు. నేడు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఏదో చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ రోజు శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ పేరుతో కులాలు మధ్యన చిచ్చుపెట్టారన్నారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కారణం నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. బీసీలకు గౌరవం ఇచ్చి దేశ ప్రధానినీ చేసిన ఘనత బీజేపీది మాత్రమేనన్నారు. సీఎం జగన్ తన మాయ మాటలతో బీసీలను మరోసారి మోసం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు.

Updated Date - 2022-12-07T11:38:56+05:30 IST