శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

ABN , First Publish Date - 2022-09-27T07:37:19+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

తిరుమల  బ్రహ్మోత్సవాలకు అంకురార్పణలో భాగంగా శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడి ఊరేగింపు


తిరుమల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించాక.. నవధాన్యాలను మట్టిలో కలిపి మొలకెత్తించే పనికి శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. మంగళవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో గోవిందుడి బ్రహ్మోత్సవాల సంబరం మొదలుకానుంది.  రాత్రి 9-11 గంటల నడుమ జరిగే పెద్ద శేష వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ మంగళవారం రాత్రి శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. 

Read more