గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని Modi

ABN , First Publish Date - 2022-07-04T16:00:28+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని Modi

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhushan Harichandan) , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మోదీ భీమవరానికి వెళ్లనున్నారు. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం భీమవారినికి వెళ్లనున్నారు. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామారాజు (Alluri Sitharamaraju) 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని పర్యటనతో భీమవరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

Read more