బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు

ABN , First Publish Date - 2022-01-24T21:30:58+05:30 IST

టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని

బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు

విజయవాడ: టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వివరణ అడిగేందుకు పోలీసులు వచ్చారని చెబుతున్నారు. కొడాలి నానిపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ‘దమ్ముంటే రా తేల్చుకుందాం’ అంటూ మంత్రికి వెంకన్న సవాల్ విసిరారు. గుడివాడలో ఇంత జరిగినా డీజీపీ స్పందించరా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే టీడీపీ వారిపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. చట్టం ముఖ్యమా?.. తాడేపల్లి ఆదేశాలు ముఖ్యమా?.. సంస్కారం లేకుండా చంద్రబాబును తిడుతుంటే చోద్యం చూస్తారా?.. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో.. డీజీపీ సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.Updated Date - 2022-01-24T21:30:58+05:30 IST