Police Vs JC : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..
ABN , First Publish Date - 2022-12-07T11:25:47+05:30 IST
తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి ర్యాలీగా బయల్దేరారు.
Police Vs JC : తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి ర్యాలీగా బయల్దేరారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, జేసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ వాహనాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. కాగా.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జేసీ ప్రభాకర్‌రెడ్డి భిక్షాటనకు దిగారు. నిరసనకు అనుమతి లేదంటూ జేసీని పోలీసులు అడ్డుకున్నారు.