అమెరికాలో విశాఖ వాసి మృతి

ABN , First Publish Date - 2022-12-30T12:58:16+05:30 IST

అమెరికాలో విశాఖ వాసి మేడిశెట్టి గోకుల్ మృతి చెందారు. మంచు తుఫానులో ప్రముఖ కార్టూనిస్ట్ బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ చిక్కుకుపోయి మరణించారు.

అమెరికాలో విశాఖ వాసి మృతి

విశాఖ : అమెరికాలో విశాఖ వాసి మేడిశెట్టి గోకుల్ మృతి చెందారు. మంచు తుఫానులో ప్రముఖ కార్టూనిస్ట్ బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ చిక్కుకుపోయి మరణించారు. గోకుల్ 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో ఓ బీమా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం భార్య శ్రీదేవి, కూతురు మహతితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో గోకుల్ పాల్గొన్నారు. వేడుకల్లో ఉండగానే ఒక్కసారిగా మంచు తుఫాన్ విరుచుకుపడింది. ప్రమాదంలో చిక్కుకున్న గుంటూరుకు చెందిన దంపతులను కాపాడే ప్రయత్నంలో గోకుల్ కూడా గల్లంతయ్యారు. విశాఖ వస్తాడు అనుకునే లోపే ఈ దుర్ఘటన వినాల్సి వచ్చిందని గోకుల్ తండ్రి బాలి ఏబీఎన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-12-30T12:58:16+05:30 IST

Read more