జగన్‌ డైరెక్షన్‌లో పెద్దిరెడ్డి అరాచకం: నిమ్మల

ABN , First Publish Date - 2022-09-08T08:51:53+05:30 IST

జగన్‌ డైరెక్షన్‌లో పెద్దిరెడ్డి అరాచకం: నిమ్మల

జగన్‌ డైరెక్షన్‌లో పెద్దిరెడ్డి అరాచకం: నిమ్మల

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 7: ‘‘సీఎం జగన్‌ డైరెక్షన్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారు. విలన్‌గా మారి అరాచకత్వానికి, రౌడీయిజానికి, దోపిడీలకు కేరా్‌ఫగా తయారయ్యారు’’ అని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చిత్తూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మరికొంతమంది టీడీపీ నాయకులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో ప్రశాంతతకు భంగం కలిగించేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం సరికాదు. రానున్న రోజుల్లో పెద్దిరెడ్డికి విలన్‌కు పట్టిన గతే పడుతుంది’’ అని అన్నారు. కాగా, కుప్పం టీడీపీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను మంగళవారం రాత్రి అరెస్టు చేసి, బుధవారం ఉదయానికి కుప్పం జూనియర్‌ అదనపు సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండు విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చిత్తూరు సబ్‌ జైలుకు తరలించారు. 


Read more