ఏసీబీ 14400 మొబైల్ యాప్‌పై పవన్ స్పందన
ABN , First Publish Date - 2022-06-06T21:57:10+05:30 IST
ఏసీబీ 14400 మొబైల్ యాప్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అమరావతి: ఏసీబీ 14400 మొబైల్ యాప్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల అవినీతి అరికట్టడానికి ఏసీబీ యాప్ పెట్టారు సరే.. మరి వైసీపీ పాలకుల అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలపై ఫిర్యాదులకు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధించడానికి ఏసీబీ ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించింది. ‘ఏసీబీ 14400’ పేరుతో రూపొందించిన ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. యాప్‌లో బటన్ నొక్కి వీడియో, ఆడియో రికార్డు చేసి ఏసీబీకి పంపాలని సూచించారు.