Pawan Kalyan: కాపులు పవన్‌ను నమ్మడం లేదన్న మంత్రి కొట్టు

ABN , First Publish Date - 2022-07-18T21:58:29+05:30 IST

కాపు సామాజికవర్గం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)ను నమ్మడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ

Pawan Kalyan: కాపులు పవన్‌ను నమ్మడం లేదన్న మంత్రి కొట్టు

అమరావతి: కాపు సామాజికవర్గం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)ను నమ్మడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఎదగటంపై పవన్ దృష్టి పెట్టాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ ముందు టీడీపీ (TDP)పై పోరాటం చేయాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పంచన ఉండి జనసేన ఇంకా పలుచన అవుతోందని ఎద్దేవాచేశారు. జనసేన పార్టీని విలీనం చేయమని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాలతో పాటు... 32 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశామని ప్రకటించారు. ఆలయాల నుంచి వచ్చే నిధులు సీజీఎఫ్ కింద జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లలేదని తెలిపారు. కావాలనే బీజేపీ బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డు ద్వారా అమ్మవారి దర్శనానికి వెళ్లడం మంచిది కాదన్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే... ఘాట్ రోడ్డు దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-07-18T21:58:29+05:30 IST