జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-03-13T23:45:10+05:30 IST

మంగళగిరి మండలం ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే ..

జనసైనికులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

అమరావతి: మంగళగిరి మండలం ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ పెట్టి 8 ఏళ్లు అయిందని, 9వ ఆవిర్భావ సభ జరగనుందని తెలిపారు. దామోదర సంజీవయ్య పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. సంజీవయ్య స్ఫూర్తితో సభ వేదికపై ప్రసంగిస్తామని తెలిపారు.


రాష్ట్ర క్షేమాన్ని కోరుకునే ప్రతిఒక్కరూ సభకు రావాలని పవన్ పిలుపు నిచ్చారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చాలా జాగ్రత్తలు తీసుకుని సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ  సభ ద్వారా దిశానిర్దేశం చేయబోతున్నట్లు పవన్ తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపై సభలో ప్రసంగించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసైనికులందరూ సభకు రావాలని పిలుపు నిచ్చారు. మార్గ మధ్యలో ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే సభకు వెళ్లడం తమ హక్కు అని చెప్పాలని పవన్ సూచించారు. Updated Date - 2022-03-13T23:45:10+05:30 IST