-
-
Home » Andhra Pradesh » Pavala made MP blue film without any expenses-NGTS-AndhraPradesh
-
పావలా ఖర్చు లేకుండా ఎంపీ బ్లూ ఫిల్మ్ తీశాడు
ABN , First Publish Date - 2022-08-15T08:29:49+05:30 IST
పావలా ఖర్చు లేకుండా ఎంపీ బ్లూ ఫిల్మ్ తీశాడు

బట్టలిప్పి తిరగమని కమ్మ, కాపులు చెప్పారా?: రామకృష్ణ
ప్రమాదంలో భారత రాజ్యాంగం: నారాయణ
తిరుపతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ రాజ్యాంగానికి ప్రమాదం రాబోతుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ అరాచకాలను అణచాలంటే పోరాటం చేయకతప్పదు. ఆ ప్రయత్నానికి సీపీఐ సిద్ధమవుతోంది’’ అని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు ఆదివారం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడారు. ‘‘ఆజాదీ కా అమృతోత్సవంలో ఇంటింటికీ జెండా పేరుతో జాతీయ పతాకాన్ని వెలకట్టి అమ్మేశారు. 12 మందిని హత్యచేసిన అమిత్షా హోం మంత్రిగా ఉండడం సిగ్గుచేటు. క్రిమినల్స్ నాయకత్వంలో దేశం ఎటుపోతుందో వేరే చెప్పక్కర్లేదు’’ అని అన్నారు.
వెంకయ్యను వాడుకొని వదిలేశారు...
‘‘వెంకయ్య నాయుడిని వాడుకొని వదిలేశారు. మోదీకి రాష్ట్రపతి డమ్మీ అభ్యర్థిగా వుండాలే తప్ప వెంకయ్యనాయుడు వంటి వ్యక్తులను ఉంచరు. గతంలో ఎన్టీఆర్ ఫెడరల్ వ్యవస్థపై పోరాటం చేశారు. అప్పుడు కొంత మార్పు వచ్చింది. మోదీ వచ్చాక రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు. ఆయన ఆదేశిస్తే ఇక్కడ జగన్ పాటిస్తారు’’ అని నారాయణ మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ‘‘హిందూపురం ఎంపీ పావలా ఖర్చులేకుండా బ్లూ ఫిల్మ్ తీసిచ్చాడు. అలా చేయడం తప్పు అని చెబుతుంటే, అది ఆయనది కాదన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దేవర దున్నపోతులా తయారైన దిగంబర ఎంపీని బట్టలు విప్పి తిరగమని కమ్మ, కాపులు చెప్పారా? ఎంపీ అయ్యావన్న జ్ఞానాన్ని మరిచిపోయి ఏదంటే అది మాట్లాడతావా?’’ అని ప్రశ్నించారు. అక్టోబరు 14న విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు వేలాదిగా జనం తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.