శనివారమూ పాస్‌పోర్టు సేవలు
ABN , First Publish Date - 2022-12-15T03:06:19+05:30 IST
పాస్‌పోర్టుల కోసం రద్దీ పెరగడంతో తత్కాల్, జనరల్ పద్ధతిలో పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి శనివారం కూడా పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీనివాసరావు
విజయవాడ (కృష్ణలంక), డిసెంబరు 14: పాస్‌పోర్టుల కోసం రద్దీ పెరగడంతో తత్కాల్, జనరల్ పద్ధతిలో పాస్‌పోర్టుల జారీలో జాప్యాన్ని నివారించడానికి ఇక నుంచి శనివారం కూడా పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే గత రెండు శనివారాలు పాస్‌పోర్టుల దరఖాస్తులు పరిశీలించగా ఈ నెల 17, 24 తేదీల్లోనూ పాస్‌పోర్టు కార్యాలయాలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. తత్కాల్, జనరల్ పద్ధతిలో పాస్‌పోర్టు వెరిఫికేషన్ ఉంటుందని, అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, సరైన పత్రాలు లేకుండా ఎవరూ రావద్దని ఆయన సూచించారు. విద్య, ఉద్యోగాలకు సంబంధించి అనేక మంది విదేశాలకు వెళుతున్నారని, విజయవాడ పాస్‌పోర్టు కార్యాలయంలోనే రోజుకు 600 దరఖాస్తులు ఇస్తున్నట్టు ఆయన వివరించారు. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని, పాస్‌పోర్టు కార్యాలయాల్లోనే అన్ని రకాల పౌరసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.