AP News: పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువకుడు అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-14T20:13:05+05:30 IST

పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వంశీ కృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

AP News: పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న యువకుడు అరెస్ట్

పల్నాడు: పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వంశీ కృష్ణ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో ఓ యువతి ఫిర్యాదుతో వంశీకృష్ణ మోసాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన పొట్లూరి వంశీకృష్ణ అనే యువకుడు కొచ్చర్ల శ్రీకాంత్ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. జీవన్ సాతి, షాది డాట్ కామ్, మ్యాట్రీమోనీలతో తప్పుడు సమాచారంతో మోసం చేశాడు. ఈ క్రమంలో నరసరావుపేట యువతిని నమ్మించిన వంశీకృష్ణ  ఆమె వద్ద నుంచి రూ.48 లక్షలు తీసుకున్నాడు. అనుమానం వచ్చి సదరు యువతి నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు వంశీ కృష్ణ మోసాన్ని బయటపెట్టి అరెస్ట్ చేశారు. యువకుడి వద్ద నుంచి రూ.38 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. 2018 నుంచి 8 మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వివరాలను ఎస్పీ రవి శంకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 

Read more