Sake Sailajanath: డిసెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర
ABN , First Publish Date - 2022-11-08T19:15:12+05:30 IST
Vijayawada: ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలఖారు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎపీసీసీ (APCC) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Sake Sailajanath) తెలిపారు.
Vijayawada: ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలఖారు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎపీసీసీ (APCC) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Sake Sailajanath) తెలిపారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో శైలజానాథ్ అధ్యక్షతన జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి పాదయాత్రను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. మోదీ విశాఖ పర్యటన ఈనెల 12న ఉన్నందున, 10,11 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరనసలు తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో జనంలోకి వెళ్తామని, కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యమని శైలజానాథ్ పేర్కొన్నారు.