పోలీసుల సహాయ నిరాకరణ

ABN , First Publish Date - 2022-10-17T10:14:27+05:30 IST

జనవాణి కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పోలీసులు సహకరించలేదని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం పోర్టు

పోలీసుల సహాయ నిరాకరణ

పవన్‌కు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు: నాదెండ్ల


విశాఖపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జనవాణి కార్యక్రమంలో భాగంగా విశాఖ వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పోలీసులు సహకరించలేదని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం పోర్టు స్టేడియానికి వెళ్లనీయకుండా హోటల్‌లోనే పోలీసులు దిగ్బంధించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో జనవాణి జరగకూడదని వైసీపీకి నాయకులు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. శనివారం సాయంత్రం ఎయిర్‌పోర్టు నుంచి కొంత దూరం ర్యాలీగా వచ్చిన తరువాత ఓ పోలీసు ఉన్నతాధికారి తమ కారుపైకి ఎక్కి, వాహనం ఎక్కడా ఆపకుండా వెళ్లనీయాలంటూ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.


తరువాత ఒక చోట కారును బలవంతంగా ఆపేశారని, ర్యాలీ లేదంటూ సోషల్‌ మీడియాలో ఒక మెసేజ్‌ పెట్టాలని, అంతవరకు వాహనాన్ని ముందుకు వెళ్లనీయబోమంటూ పవన్‌పై ఒత్తిడి చేశారని తెలిపారు. హారతులు ఇవ్వడానికి దారి పక్కన నిలబడిన మహిళలకు అభివాదం చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ లే వగా, బలవంతంగా కూర్చోబెట్టారని చెప్పారు. ర్యాలీ సాగుతున్నంతసేపు ప్రతి నిమిషం డీసీపీకి ఫోన్లు వచ్చాయన్నారు.  వైసీపీ గర్జన అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడం, పవన్‌ కల్యాణ్‌ ర్యాలీకి భారీగా జనాలు రావడంతో అక్కసు, బాధ, కక్షతో ఈ విధంగా వ్యవహరించారన్నారు.  

Updated Date - 2022-10-17T10:14:27+05:30 IST