మా భూమిని వైసీపీ నేత కబ్జా చేశారు.. కలెక్టరేట్లో రైతు కుటుంబం ఆందోళన
ABN , First Publish Date - 2022-04-27T18:11:11+05:30 IST
జిల్లాలోని తుని నియోజకవర్గం కె వో మల్లవరంలో వైసీపీ నేతలు తన భూమిమి కబ్జా చేసారంటూ కలెక్టరేట్లో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది.

కాకినాడ: జిల్లాలోని తుని నియోజకవర్గం కె వో మల్లవరంలో వైసీపీ నేతలు తన భూమిని కబ్జా చేసారంటూ కలెక్టరేట్లో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. తమకు చెందిన 8 ఎకరాల భూమిని మంత్రి దాడిశెట్టి రాజ అనుచరులు కబ్జా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతో భూ యాజమాని అయిన తమపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు పురుగుల మందు డబ్బాతో రైతు కుటుంబం వచ్చింది. స్థలం కాజేయడంతో పశువులకు చోటు లేకుండా పోయిందని కలెక్టరేట్‌కు రైతు తన పశువులను తీసుకొచ్చాడు. తమ ఇంటి పెద్ద సుర్ల కొండలస్వామి చనిపోవడంతో ఆస్తుల కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టులో కేసు ఉండగా తమ భూమిలో వైసీపీ నాయకులు కంచె వెయ్యడంతో రైతు కుటుంబసభ్యులు మనస్తాపం చెందారు.