ఒట్టేసి చెబుతున్నాం.. ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-10-07T08:49:00+05:30 IST
ఒట్టేసి చెబుతున్నాం.. ఏ ఒక్కరినీ వదలం: అచ్చెన్న
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలు కనీస మానవత్వాన్ని మరిచి ప్రజలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పండుగ పూట టీడీపీ బీసీ కార్యకర్త కూర్మగిరి పెదమాదన్నను వైసీపీ గూండాలు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని జగన్ అండ చూసుకుని విర్రవీగే వైసీపీ బ్యాచ్ గుర్తుంచుకోవాలి. దసరానాడు దుర్గమ్మపై ఒట్టేసి చెబుతున్నాం.. మా కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం’’ అని బుధవారం అచ్చెన్న హెచ్చరించారు.