జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీల కుట్రలు: బాలినేని

ABN , First Publish Date - 2022-01-30T01:03:22+05:30 IST

జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీల కుట్రలు: బాలినేని

జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీల కుట్రలు: బాలినేని

ఒంగోలు: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కొత్తదేమి కాదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఏడాది కాలంగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిటీ సిఫార్సుల మేరకు నూతన జిల్లాల ప్రకటన వెలువడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏది చేసినా పారదర్శకంగానే చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీ చర్చలకు ఆహ్వానించిందని ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-30T01:03:22+05:30 IST