ఇంతకింతా తీర్చుకుంటాం!
ABN , First Publish Date - 2022-10-17T09:44:20+05:30 IST
వైసీపీ నేతలు పెడుతున్న వేధింపులకు ఇంతకు ఇంతా బదులు తీర్చుకుంటామని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష హెచ్చరించారు.
కుటుంబ సభ్యుల గురించి చిన్నబుద్ధితో మాట్లాడతారా?
హుందాతనం ఉండొద్దా?.. ఏమిటీ గాలి మాటలు?
మంత్రి అప్పలరాజుకు సంస్కారం లేదు.. గౌతు శిరీష ఫైర్
ఆడపిల్లల జోలికి రావడమేంటి?.. పశువుల మంత్రంటే తప్పా?
అమరావతికే ఉత్తరాంధ్ర జనం జై.. చంద్రబాబు చెబితేనే రాజకీయాల్లోకి
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో గౌతు లచ్చన్న మనవరాలు
వైసీపీ నేతలు పెడుతున్న వేధింపులకు ఇంతకు ఇంతా బదులు తీర్చుకుంటామని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష హెచ్చరించారు. తనపై పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. ఆయన డాక్టరే గానీ సంస్కారం లేదని మండిపడ్డారు. శిరీష సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ పెద్ద కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఆమె పాలుపంచుకున్నారు. విశేషాలివీ..
ఆర్‌కే: వెల్కం టూ ఓపెన్ హార్ట్ శిరీషా.. ఎలా ఉన్నారు?
శిరీష: థ్యాంక్యూ అండీ.
ఆర్‌కే: చక్కగా సంప్రదాయబద్ధంగా ఉన్నావు. రాజకీయాల్లో ఎమోషన్ అయితే ఎలా?
ఎంతైనా ఆడపిల్లలం కదా సర్! రాజకీయాల్లోకి రావాలనుకుని రాలేదు కదా! నాన్న సీనియర్ ఎమ్మెల్యే. తాతకు మంచి పేరుంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు చిన్నప్పటి నుంచీ తెలు సు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాగా తెలుసు. అందరూ ఫ్యామిలీలా ఉంటారు. కాబట్టి ఆడుతూపాడుతూ చేయొచ్చనుకున్నాను. కానీ నాన్నగారు ఫేస్ చేయనివి కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందనుకోలేదు. రైట్ టైంలో నేను ఎగ్జిట్ అయ్యా ను.. వరస్ట్ టైంలో నువ్వు ఎంటరయ్యావని నాన్న అంటారు.
పొలిటికల్ ఫ్యామిలీ కదా! లచ్చన్నగారు 96 ఏళ్లు బతికారు. రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయని అనుకోలేదా?
ప్రతిపక్షంలో ఉన్న లచ్చన్నగారి దగ్గరకు సలహాల కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా వచ్చేవారు. ఇలాంటివి ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ముఖ్యంగా ఆడపిల్లల జోలికి రావడం.. మానసికంగా వేధించడం వైసీపీ నుంచే చూస్తున్నాం.
అప్పలరాజు ఒకప్పుడు టీడీపీనే కదా?
టీడీపీ సానుభూతిపరుడని నేనూ విన్నాను. మా ఎంపీ రామ్మోహన్ పేరు మీద స్టిక్కర్ పెట్టుకుని టోల్‌గేటులో వెళ్లేవారన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. నువ్వు నిరూపించుకో. అందులో డాక్టర్‌వి. చాలా హుందాగా ఉండాలి. కానీ ఒకవిధంగా అది నాకు హెల్ప్ చేసిందనే అనుకుంటున్నా. చాలా సాఫ్ట్‌గా ఉండే శిరీష నోరు కూడా గట్టిగానే వాడుతోంది అప్పలరాజు వల్లే..!
నాన్న ఏమంటున్నారు?
ముందు భయపడ్డారు. మొదట్లో నేను కూడా ఫంక్ అయ్యాను. మెంటల్ హెరా్‌సమెంట్ సహించలేనిది.. నా కేరెక్టర్ గురించి కూడా మాట్లాడుతుంటే.. ఇలాంటి అడ్రస్ లేని వారితో అనిపించుకోవాలా అనే బాధ ఉంది. దాంతో నేను కూ డా నాకొద్దు నాన్నా అని చెప్పాను. ఆయన సాఫ్ట్ కాబట్టి బలవంతం చేయను.. చంద్రబాబుకు చెప్పేయ్‌మన్నారు. కానీ అమ్మ రాయలసీమ నుంచి వచ్చింది. కడప జిల్లాలో తాత మలిశెట్టి నరసరామయ్యగారు సర్పంచ్‌గా చేశారు. వైఎస్ రాజారెడ్డికి తాత మంచి ఫ్రెండ్. అప్పుడు అమ్మ ఒక మాట అన్నది. నువ్వు వెళ్లిపోతే శిరీష వెళ్లిపోయిందనరు.. లచ్చన్న మనవరాలు వెళ్లిపోయిందంటారు. తాతయ్య పేరు వదిలిపెడతావా.. ముందుకు తీసుకెళ్తావా ఆలోచించుకో అన్నది.
మీకు, అప్పలరాజుకు.. కళింగ యుద్ధంలా తయారైంది?
జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. మా దగ్గర అప్పలరాజు, అచ్చెన్నాయుడి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దు వ్వాడ.. వీళ్లిద్దరితో సీతారాంను పోల్చలేం. ఒకట్రెండు సార్లు సీతారాం మాట్లాడిన మాటలు విన్నాక ఆయన వయసుకు అలా మాట్లాడడం సరైంది కాదేమోనన్న బాధ కలిగింది. అసెంబ్లీలో డీఎన్‌ఏ రిపోర్టుల గురించి.. పుట్టుకల గురించి మాట్లాడుతుంటుంటే.. చూడాలంటేనే బాధనిపిస్తోంది. చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందనే ఇలా మాట్లాడడం.
గౌతు శిరీష అనగానే రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. దీనికి కూడా అప్పలరాజుకు థ్యాంక్స్ చెప్పాలేమో?
ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. లచ్చన్న పేరును మళ్లీ ఈ జనరేషన్‌కు పరిచయం చేసి.. వాళ్ల పార్టీ నాయకులే ఈ రోజున చాలా ప్రాంతాల్లో లచ్చన్న విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు. లచ్చన్నకు సర్దార్ బిరుదు ఉందా అని ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టించే మూర్ఖులను పలాసలో అప్పలరాజు తయారుచేశారు.
మీరు పలాసలో ఫైటర్‌గా వెళ్లాలా?
ఫైటర్‌గానే రాజకీయం చేయాలి. ఆడవాళ్లకు ఇబ్బందే. కానీ కుటుంబం, మన చుట్టూ ఉన్నవాళ్లు మనతో ఉంటే ఇలాంటి గాలి వెధవలను ఈజీగా ఫేస్ చేయొచ్చు.
జగన్ పాలన చూశారు కదా! ఏం నేర్చుకున్నారు?
ప్రజలను భయపెడితే కంట్రోల్ చేయవచ్చని జగన్ నిరూపించారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువులు చదివిన వాళ్లు కూడా.. ముఖ్యమంత్రి చేతిలో బానిసలుగా అయిపోతారా? ఒక సిస్టమ్‌ను భయపెట్టి ఇలా కంట్రోల్ చేయొచ్చని నేర్చుకున్నాం.
మీరు కూడా అలాగే కంట్రోల్ చేస్తారా?
చేయాల్సి వస్తుందేమో! మేం ఊరుకున్నా కార్యకర్తలు ఊరుకోనివ్వరు. రామ్మోహన్‌నాయుడి మీద నిలబడతానని అప్పలరాజు వాగితే.. నీ లెవల్‌కి రామ్మోహన్ అక్కర్లేదు.. నేను చాలని ఒక కుర్రాడు సమాధానమిస్తే.. ఆ కుర్రాడిని పోలీసు లు అర్ధరాత్రి తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ విషయా న్ని డీఐజీ ర్యాంకు అధికారికి చెప్పాను. పైనుంచి ఆదేశాలు అలా ఉన్నాయని ఆయన అన్నారు.
మీరు వైసీపీలోకి వెళ్తే గోల ఉండదు కదా!
వెళ్లేదే లేదు. అవసరమైతే రాజకీయం వదిలేస్తా. మేం బాదుడే బాదుడుకు వెళ్తే ముఖ్యంగా మహిళలు.. బుద్ధి తక్కు వై ఓటు వేశామని వాపోతున్నారు.
రాజధాని వస్తుందంటే మీరు వద్దంటున్నారని స్థానికంగా వ్యతిరేకత లేదా?
ఎక్కడా రావడం లేదు. సాధారణ ప్రజలందరికీ అర్థమవుతోంది. బొత్స, ధర్మాన వంటి వారు పదవులు కాపాడుకోవడానికి మాట్లాడుతున్నారు. ఒక్కరికి కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వస్తుందన్న నమ్మకం లేదు.
మీ భర్త ఎందుకు వివాదమవుతున్నారు?
ఒక్కరోజు కూడా నా భర్త నా వెనుకాల రాలేదు. నా తరఫు న వచ్చి ఎక్కడా ఏమీ చేయలేదు. కేవలం ఆర్థికపరమైన విషయాలే చూసుకుంటారు. మిగిలిన వాటిలో జోక్యం చేసుకోరు. ఈ రోజున అప్పలరాజు మీద ఎన్ని వస్తున్నాయో చూస్తున్నారు కదా..! ఏకంగా మావోయిస్టులే లేఖ రాశారు. చాలెంజ్ చేస్తున్నా. నాకు, నా భర్తకు, నా తల్లిదండ్రులకు, నా చెల్లికి ఎవరికైనా అక్రమంగా లే అవుట్స్ ఉన్నా.. ఇంకేదైనా ఉంటే నిరూపించమనండి. ఇవేవీ లేవు కాబట్టే ఆయన కులాన్ని టార్గెట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో మీ టార్గెట్?
నేను, నాతోపాటు పార్టీ గెలవడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.
మీరెందుకు టార్గెట్ అయ్యారు?
డాక్టర్ అప్పలరాజును వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నేను కూడా సంతోషించాను. డీసెంట్ ఫైట్ ఉం టుందనుకున్నా. ఆయన చదివింది డాక్టరే కానీ సంస్కా రం లేదని వారంలోనే అర్థమైంది. గౌతు కుటుంబాన్ని అనడానికి ఏమీలేక నా ఇంటి పేరు గురించి మాట్లాడారు. నేను యార్లగడ్డ వారి కోడలినైనా గౌతు శివాజీ కూతురినే కదా! కమ్మవారి కోడలు శ్రీకాకుళంలో ఏం చేస్తుంది అంటారా? నాకు నచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి చిన్నబుద్ధితో మాట్లాడతారని నేను ఊహించలేదు.
మాట్లాడితే పశువు పశువు అంటారు. మీ దృష్టిలో ఎవరు?
ఒక్క తప్పు మాట్లాడినా మనపై ఉంటుందని ఆయన శాఖలో శాఖ తీసేసి పశువుల మంత్రి అన్నాను. అంతకుమిం చి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. పశువుల మంత్రి అనడాన్ని నాన్న ఒప్పుకోలేదు. కానీ తప్పలేదు. నా కోపం ఎలా తీర్చుకోవాలి? మాటకు మాట సమాధానం ఇవ్వకపో తే.. 40 ఏళ్లు తల్లిదండ్రులు ఒక మాట అనకుండా పెరిగితే.. అడ్రస్ లేని వాళ్లకు ఫోన్ ఇచ్చి మాట్లాడిస్తే భయపడి వెళ్లిపోతే ఇంకేముంది?