బాత్రూం నిర్మాణంలో ‘ఓంకారం, శంఖం’ టైల్స్‌

ABN , First Publish Date - 2022-10-05T08:10:37+05:30 IST

బాత్రూం నిర్మాణంలో ‘ఓంకారం, శంఖం’ టైల్స్‌

బాత్రూం నిర్మాణంలో ‘ఓంకారం, శంఖం’ టైల్స్‌

స్థానికుల ఆగ్రహంతో తొలగించిన కాంట్రాక్టర్‌

భీమవరం, అక్టోబరు 4: దేవుడి గదిలో ఉండాల్సిన ఓం కారం.. శంఖం.. జ్యోతి ప్రజ్వలన చేసే దీపం గుర్తులు బాత్రూంలో కనిపించడాన్ని ఏమంటాం?!.. పశ్చిమ గోదావరి భీమవరం మండలం గొల్లవానితిప్పలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. ఇక్కడి గ్రామ పంచాయతీ భవనంపై సచివాలయం నిర్మించారు. భవనం ఎదుట మరుగుదొడ్ల నిర్మాణంలో శంఖం, ఓంకారం, జ్యోతిప్రజ్వలన గుర్తులున్న టైల్స్‌ వినియోగించడాన్ని చూసిన స్థానికులు మండిపడ్డారు. వారి ఆగ్రహంతో దిగివచ్చిన కాంట్రాక్టర్‌ కొండేటి బాలాజీ ఆ టైల్స్‌ తొలగించి వేరేవి వేయించారు.


Read more