అనంతపురం జిల్లాలో పోలీసుల దౌర్జన్యం... విచారణకు హెచ్‌ఆర్సీ ఆదేశం

ABN , First Publish Date - 2022-03-17T00:03:23+05:30 IST

చెన్నేకొత్తపల్లి మండలంలో పోలీసులు దౌర్జన్యం రోజు రోజుకూ మితి మీరిపోతోంది. నెలక్రితం ఇంటి స్థలం వివాదంలో..

అనంతపురం జిల్లాలో పోలీసుల దౌర్జన్యం... విచారణకు హెచ్‌ఆర్సీ ఆదేశం

అనంతపురం: చెన్నేకొత్తపల్లి మండలంలో పోలీసులు దౌర్జన్యం రోజు రోజుకూ మితి మీరిపోతోంది. నెలక్రితం ఇంటి స్థలం వివాదంలో గంగినేపల్లికి చెందిన వృద్ధుడు వెంకట్రాముడిని ఎస్సై శ్రీధర్ చితకబాదారు. అయితే వృద్ధుడిపై జరిగిన దాడిని హెచ్చార్సీ తీవ్రంగా స్పందించింది. అడిషినల్ ఎస్పీతో విచారణ చేయించి ఏప్రిల్ 6న నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పోలీసులు విచారణకు ముందే వెంకట్రాముడి చేత బలవంతంగా తెల్లపేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Read more