పోస్టల్‌ ఖాతాలున్నా అమ్మఒడికి ఓకే

ABN , First Publish Date - 2022-05-24T09:05:53+05:30 IST

అమ్మఒడి పథకం లబ్ధిని పొందేందుకు విద్యార్థుల తల్లులకు పోస్టల్‌ బ్యాంకు ఖాతాలున్నా సరిపోతుంది. అయితే అవి ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలి.

పోస్టల్‌ ఖాతాలున్నా అమ్మఒడికి ఓకే

 అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకం లబ్ధిని పొందేందుకు విద్యార్థుల తల్లులకు పోస్టల్‌ బ్యాంకు ఖాతాలున్నా సరిపోతుంది. అయితే అవి ఆధార్‌తో అనుసంధానం చేయించుకోవాలి. బ్యాంకు ఖాతాలే కాకుండా పోస్టల్‌ బ్యాంకు ఖాతాలున్నా అమ్మఒడి ప్రయోజనం అందిస్తామని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ సోమవారం ఒక మెమో విడుదల చేశారు.

Updated Date - 2022-05-24T09:05:53+05:30 IST